నా మద్దతు ఎప్పుడూ అర్జున్ కపూర్ కే వుంటుంది!: పరిణీతి చోప్రా
- అర్జున్ కపూర్ పట్ల ప్రత్యేక అభిమానం ప్రకటించిన పరిణీతి
- అర్జున్ కపూర్ కి తన జీవితంలో ప్రత్యేక స్థానం
- తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది
తన జీవితంలో అతనిది ప్రత్యేక స్థానమని పరిణీతి పేర్కొంది. తనకు ఎవరైనా నచ్చని పక్షంలో వారు నచ్చేలా చేసుకుంటానని అంది. కాగా, ప్రియాంకా చోప్రా సోదరిగా 'లేడీస్ వర్సెస్ రికీ బెహల్' సినిమాతో రణ్ వీర్ సింగ్ సరసన తెరంగేట్రం చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత అర్జున్ కపూర్ తో కలిసి నటించిన 'ఇషక్ జాదే' సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది.