భారీగా పెరిగిపోయిన టమోటా ధరలు!
- ఢిల్లీలో కిలో టమోటా ధర రూ.80
- మిజోరాంలో కిలో రూ.100
- బెంగళూర్‌లో కిలో రూ 45 నుంచి రూ 50 మధ్య
- భారీ వర్షాలతో టమోటా పంటలకు నష్టం
కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమోటా మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే ధరలు అదుపులోకి రావచ్చని అక్కడి వర్తకులు చెప్పారు. మరోవైపు ఉల్లి ధర కూడా సామాన్యుడి కంట నీరు పెట్టిస్తోన్న విషయం తెలిసిందే.