అకౌంటులో డబ్బులు వేయాలంటూ.. ఎంపీ కొత్తపల్లి గీతకు బెదిరింపు మెయిల్స్!
- వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు వచ్చిందంటూ మెయిల్ లో పేర్కొన్న దుండగుడు
- వివరాలు కావాలంటే అకౌంట్ లో డబ్బులు వేయాలంటూ డిమాండ్
- పోలీసులను ఆశ్రయించిన గీత
తనకే కాక ఇలాంటి మెయిల్స్ చాలా మంది ఎంపీలకు వస్తున్నాయని ఈ సందర్భంగా గీత అన్నారు. ఇటీవల తన కుమారుడి అకౌంట్ నుంచి రూ. 12 వేలు మాయమయ్యాయని... ఇది జరిగి ఎనిమిది నెలలైనా బ్యాంకు నుంచి ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్స్ పై బ్యాంకులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సైబర్ క్రైమ్ అంశాన్ని తాను లేవనెత్తుతానని తెలిపారు. ఈ ఘటనలను కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళతానని చెప్పారు.