ivanka trump: ప్రియుడి కోసం మతం మారింది.. మనువాడింది.. ఇవాంకా ట్రంప్ ప్రేమకథ!

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 28న హైదరాబాదులో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా ఇవాంకా ట్రంప్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వివాహానికి సంబంధించిన ఆసక్తికర విశేషం వెలుగు చూసింది. ఇవాంకా ట్రంప్ మతం మారి మరీ జేడ్ కుష్నర్ ను వివాహం చేసుకున్న సంగతి వెలుగు చూసింది. 2005లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా జేడ్ కుష్నర్ ను ఇవాంకా ట్రంప్ తొలిసారి కలుసుకుంది.

అనంతరం వ్యాపార, వ్యక్తిగత అభిరుచులు కలవడంతో మూడేళ్లు ఇద్దరూ డేటింగ్ చేశారు. ఈ విషయం కుష్నర్ తల్లిదండ్రులకు తెలియడంతో సంప్రదాయ యూదులైన వారు ఆ బంధానికి అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరూ విడిపోయారు. దీనిని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవ మతం వదిలి యూదు మతం స్వీకరించి 2009లో కుష్నర్ ను వివాహం చేసుకుంది. ఆమె నిర్ణయానికి తండ్రి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు పలకడం విశేషం. ఆ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. 
Go Back to Shorts
ivanka trump
jade kushner
marriage

More Telugu News