నేడే క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ వివాహం!
- మీరట్ లో నేడు భువనేశ్వర్ కుమార్ వివాహం
- గతనెలలోనే ట్విట్టర్ మాధ్యమంగా ప్రేమలో ఉన్నానని ప్రకటన
- చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నాగర్ తో వివాహం
వివాహం కారణంగా, శ్రీలంకతో జరగనున్న తరువాతి రెండు టెస్టులకు భువీ దూరం కానున్నాడు. కాగా, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్నేహితుడు భువీకి శుభాకాంక్షలు చెబుతూ...‘మా జట్టులో మరో పులి బిడ్డ ఇకపై భార్యకు బానిస కాబోతున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి భువీ సమాధానమిస్తూ ‘ఆమె ప్రేమకు బానిసను’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.