rail: రైలు కింద దూరి అవతలకు వెళ్లే ప్రయత్నం.. అంతలోనే కదిలిన రైలు.. బతికిపోయిన వైనం!

షార్ట్స్‌లో చూడండి
తనపైనుంచి రైలు వెళ్లనుందన్న విషయం తెలుసుకున్న ఓ ప్ర‌యాణికుడు రైల్వే ట్రాక్‌పై ప‌డుకున్నాడు. అదృష్ట‌వ‌శాత్తూ అత‌డిపై నుంచి రైలు వెళ్లినా అతనికి ఎటువంటి గాయాలూ కాలేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన‌ ఓ వ్యక్తి దేవరియా రైల్వే స్టేష‌నుకి వ‌చ్చి, తాను ఎక్కాల్సిన రైలు అవతలి ప్లాట్‌ ఫాంపై ఉండటాన్ని గ‌మ‌నించాడు. అయితే, ఆ రైలు వెళ్లిపోతోంద‌ని తెలుసుకుని పట్టాలను దాటేందుకు మధ్యలో అడ్డుగా ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి దూరి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు.

అదే స‌మ‌యంలో ఆ గూడ్స్‌ రైలు ఒక్క‌సారిగా కదలడంతో.. చటుక్కున ఆ రైలు కిందే పట్టాల మధ్య ప‌డుకున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి ఇత‌ర‌ ప్ర‌యాణికులు ఆ వ్య‌క్తి చ‌నిపోయి ఉంటాడ‌ని అనుకున్నారు. కానీ, త‌న‌పై నుంచి రైలు వెళ్లిన అనంత‌రం ఎంచ‌క్కా లేచి ప‌ట్టాల‌ను దాటుకుంటూ అతను వెళ్లిపోవడంతో అందరూ మృత్యుంజయుడంటూ కామెంట్ చేశారు.


Go Back to Shorts
rail
Uttar Pradesh
train crossing

More Telugu News