ఇవాంకా ట్రంప్ కు కేసీఆర్ అద్భుతమైన విందు ఏర్పాటు... తెలంగాణ అతిథి మర్యాదల్లో వంటకాలివే!
Add ap7am to your home Screen

ఇవాంకా ట్రంప్ కు కేసీఆర్ అద్భుతమైన విందు ఏర్పాటు... తెలంగాణ అతిథి మర్యాదల్లో వంటకాలివే!

  • ఇవాంకా ట్రంప్ కు ఈనెల 29 న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విందు
  • గోల్కొండ కోటలో ఆతిథ్యం 
  • నోరూరించే హైదరాబాదు, ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరేబియన్ రుచులు
  • విందు బాధ్యతలను భుజానికెత్తుకున్న కేటీఆర్
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు, ఆయన తనయ అయిన ఇవాంకా ట్రంప్ హైదరాబాదు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు గ్రేట్ డిన్నర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 29న ఆమెకు గోల్కొండ కోట వేదికగా అద్భుతమైన డిన్నర్ ఇచ్చి తెలంగాణ ప్రతిష్ఠను పెంచాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన భుజస్కందాలపై వేసుకున్నారు.

ఈ విందులో హైదరాబాదు సంస్కృతిని ప్రతిబింబించే పతర్ కా గోస్ట్, షీర్ కుర్మా, డబుల్ కా మిఠా, బగారే బైగాన్, దమ్ కి బిర్యానీ, కుర్బానీ కా మీఠా, ఇరానీ చాయ్, రవ్వ లడ్డు తదితరాలతో పాటు ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరేబియన్ వంటకాలను తయారు చేయించనున్నారు. ఈ మేరకు దేశంలోనే చేయితిరిగిన చెఫ్ లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని సమాచారం. వారంతా హైదరాబాదు చెఫ్ లతో కలసి వంటల తయారీ బాధ్యతలు పంచుకోనున్నారు. తన హైదరాబాదు పర్యటన ఇవాంకాకు చిరకాలం గుర్తుండేలా వంటకాలను తయారు చేయించనున్నారు.
ivanka trump
hyderabad tour
telangana dinner
KTR

More Telugu News