ఇవాంకా పర్యటన నేపథ్యంలో రంగంలోకి రహస్య ఏజెంట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకా పర్యటన నేపథ్యంలో రంగంలోకి రహస్య ఏజెంట్లు!

  • నెల రోజుల క్రితమే పర్యాటకుల్లా హైదరాబాద్‌ చేరుకున్న సీక్రెట్ ఏజెంట్లు
  • ఇవాంకా పర్యటించే ప్రాంతాల సమాచారం సేకరణ
  • వీరు పంపే సమాచారంపైనే ఇవాంకా పర్యటనకు తుది రూపు
 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న అమెరికా సెక్యూరిటీ బృందం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అయితే మూడో కంటికి కూడా తెలియకుండా హైదరాబాద్‌లో కాలుమోపిన రహస్య ఏజెంట్లు ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని నిఘా వర్గాలకు పంపుతున్నట్టు తెలుస్తోంది.

ఇవాంకా తన పర్యటనలో భాగంగా ఎక్కడెక్కిడికి వెళతారు? అమెను కలిసేది ఎవరు? వారి నేపథ్యం, వారి భద్రత తదితర వాటిపై సీక్రెట్ ఏజెంట్లు సమాచారం సేకరిస్తున్నారు. సాధారణ పర్యాటకుల్లా నెల రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వారు సమాచార సేకరణలో మునిగిపోయినట్టు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇవాంకా పాల్గొనే సదస్సులో వేదికపై ఉండే వారి దగ్గరి నుంచి చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, ప్రాంతాలు, నిర్వాహకుల వివరాలను కూడా సేకరించారు. పూర్తి సమాచారం తమ చేతికి వచ్చాక ఆ వివరాలను అమెరికా భద్రతా విభాగాలకు పంపిస్తారు. దానిని బట్టి ఇవాంకా పర్యటన తుది రూపు ఉంటుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.  
Ivanka Trump
Hyderabad
America

More Telugu News