తక్షణం రాహుల్ పట్టాభిషేకం లేదు... కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సీడబ్ల్యూసీ
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 24
- డిసెంబర్ 8న ఎన్నికలు
- 11న ఫలితాల వెల్లడి
- రాహుల్ కు పోటీ దాదాపు లేనట్టే!
రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ అని సీడబ్ల్యూసీ ప్రకటించింది. డిసెంబర్ 1 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, డిసెంబర్ 8న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక, 11న ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ మినహా మరెవరైనా నామినేషన్ వేస్తారని భావించడం లేదని, ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలోని ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని కొనసాగించాలని భావించిన మీదటే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్టు తెలిపారు.