baichung bhatiya: మాజీ ఉగ్రవాదికి ఫుట్ బాల్ పాఠాలు చెప్పనున్న బైచుంగ్ భాటియా

  • లష్కరే తోయిబాలో చేరిన యువ ఫుట్ బాలర్
  • తిరిగి జన జీవన స్రవంతిలోకి
  • శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చిన బైచుంగ్

లష్కరే తోయిబాలో కమాండర్ గా పని చేస్తూ, తిరిగి జన జీవన స్రవంతిలో కలిసిన మాజిద్ ఖాన్ కు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ ఆటలో ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు దిగ్గజ ప్లేయర్, భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భాటియా శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ విజయాన్ని ఆయనే స్వయంగా జమ్ము అండ్ కాశ్మీర్ ఫుల్ బాల్ ఫెడరేషన్ కు రాసిన లేఖలో తెలిపాడు.

 "ఫుట్ బాల్ వంటి అందమైన ఆటలో అతను ప్రావీణ్యం పొంది మంచి పేరును తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అతను ఉగ్రవాద సంస్థలో చేరాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరం. అయితే తిరిగి బయటకు వచ్చాడు. నేను అతనికి శిక్షణ ఇస్తాను" అంటూ 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవమున్న బైచుంగ్ వ్యాఖ్యానించాడు. ఢిల్లీలోని తన ఫుట్ బాల్ స్కూల్ లో అతనికి పాఠాలు చెబుతానని, ఆపై అతని ప్రావీణ్యం బట్టి అవకాశాలు లభిస్తాయని చెప్పాడు. తనకు లభించిన ఈ అవకాశాన్ని మాజిద్ ఉపయోగించుకుంటాడని భావిస్తున్నట్టు తెలిపాడు. అతనో మంచి ఫుట్ బాల్ ప్లేయర్ అని, కానీ ట్రోఫీలు కూడా గెలుచుకున్నాడని తెలిసి ఆనందం వేసిందన్నాడు.

More Telugu News