bandla ganesh: ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తుంటే ఏడుపొచ్చేది!: బండ్ల గణేశ్

షార్ట్స్‌లో చూడండి
నిర్మాత బండ్ల గణేశ్ .. ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తాను పనిచేసిన దర్శకుల గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్లతో కలిసి పనిచేసిన నాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. "మొదటి నుంచి కూడా నాకు పూరీ జగన్నాథ్ అంటే ఇష్టం .. ఇక ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనను నేను శ్రీను వైట్ల .. హరీష్ శంకర్ లలో చూశాను. సినిమా అంటే ఇష్టం లేకుండా .. నిదానంగా తీద్దాంలే అనుకునే ఒక డైరెక్టర్ తోను పని చేశాను"

"ఆయనతో సినిమా చేయడానికి నాకు ఏడుపొచ్చేది .. పేరు చెప్పను .. ఎందుకు ఆయన పొట్టగొట్టడం. ఈయనతో సినిమా చేస్తున్నానేంట్రాబాబూ అనుకునేవాడిని. అలాంటివాడికి భగవంతుడు లైఫ్ ఇవ్వకూడదనే నేను అనుకుంటా. ఆయనకి డైరెక్షనే రాదు సార్ .. షాట్ చెప్పి మరో విషయాన్ని గురించి ఆలోచన చేస్తుంటాడు. నాలుగైదు షాట్లు బాగా తీసినవాడు కాదు సార్ మంచి డైరెక్టర్ అంటే, చెప్పిన సమయానికి సినిమా తీసి చేతిలో పెట్టేవాడు" అంటూ తన మనసులోని మాట చెప్పారు.      
Go Back to Shorts
bandla ganesh

More Telugu News