nara brahmini: రక్తదానం చేసిన నారా బ్రాహ్మణి, ఉపాసన!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనలు రక్తదానం చేసి, ఇతరుల్లో చైతన్యం నింపారు. తాము రక్తదానం చేసిన విషయాన్ని ఉపాసన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు. ఈ మధ్యాహ్నం తాను, బ్రాహ్మణి రక్తదానం చేశామని తెలిపారు. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయడాన్ని మీరు ప్రారంభిస్తే ప్రతి 90 రోజులకు ఒక్కసారి 60 ఏళ్లు వచ్చే వరకు రక్తదానం చేయవచ్చని ఈ సందర్బంగా బ్రాహ్మణి చెప్పినట్టు ఉపాసన తెలిపారు. 500 జీవితాలను కాపాడే సత్తా మీకు ఉంటుందని చెప్పారని అన్నారు. ఇది ఎంతో శక్తిమంతమైన సహాయం అని, మనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఉపాసన తెలిపారు.
Go Back to Shorts
nara brahmini
upasana

More Telugu News