పనికిమాలినవాళ్లు సృష్టించే పుకార్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: బండ్ల గణేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పనికిమాలినవాళ్లు సృష్టించే పుకార్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: బండ్ల గణేశ్

  • పైకొచ్చిన వాళ్లంతా తప్పుచేసిన వాళ్లు కాదే
  • సంపాదించడం చేతకాని వాళ్లే డబ్బంటే ఆశ లేదు అంటారు 
  • సంపాదించే వాళ్లను చూసి విమర్శలు చేస్తుంటారు 
తాజాగా ఐ డ్రీమ్స్ తో బండ్ల గణేశ్ మాట్లాడారు .. ఆయన అమ్మాయిలను అడ్డుపెట్టుకుని పైకి వచ్చారనే టాక్ గురించి ఈ కార్యక్రమంలో ప్రస్తావించగా, ఆయన కాస్త తీవ్రంగానే స్పందించారు. "మీ ద్వారా అందరికీ చెబుతున్నాను .. బండ్ల గణేశ్ బ్రోకర్ కాదు. ఇండస్ట్రీలో చాలా మంది పైకి వచ్చారు .. వాళ్లంతా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్లు కాదే? ఎలాంటి పనీ పాటా లేకుండా .. తప్పుడు మాటలు మాట్లాడే మనుషులకు నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు" అని అన్నారు

 "నాకొక జీల్ వుంది .. గోల్ వుంది .. ఎయిమ్ వుంది. ఆ గోల్ తోనే నేను ముందుకు వెళుతుంటాను. మాములుగా వుండే గణేశ్ ఇలా ఎదిగిపోయాడేంటని అనుకునే వాళ్లు ఏదో ఒకటి మాట్లాడాలి గదా. మాకు డబ్బు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు .. ఆశ లేదు అని మాట్లాడుతుంటారు. ఓ కోటి రూపాయలు సంపాదించి .. ఓ పదిమందికి దానం చేసి .. ఆశ లేదంటే న్యాయం వుంది. సంపాదించడం చేతకాని వాళ్లు అలా మాట్లాడటంలో అర్థం లేదు. అలాంటి పనికిమాలిన వాళ్లు సృష్టించే పుకార్లకు .. కష్టపడి పైకొచ్చిన నేను సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు" అంటూ చెప్పుకొచ్చారు.      
bandla ganesh

More Telugu News