అంటార్కిటికా, గ్రీన్ లాండ్ మంచు కరిగితే ముందు మునిగేది మంగళూరే... నాసా సంచలన ప్రకటన!
Add ap7am to your home Screen

అంటార్కిటికా, గ్రీన్ లాండ్ మంచు కరిగితే ముందు మునిగేది మంగళూరే... నాసా సంచలన ప్రకటన!

  • పోర్టు నగరాలు మునిగే ప్రమాదముందన్న నాసా
  • ప్రపంచ వ్యాప్తంగా 293 పోర్టు నగరాలపై అధ్యయనం
  • ముందుగా మంగళూర్ మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా అంటార్కిటికా నుంచి అతిపెద్ద మంచు ఫలకం విడిపోయిందని నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. ధృవప్రాంతాల్లో మంచు కరిగిపోవడం కారణంగా సముద్రజలాలు పొంగి వివిధ నగరాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు కరిగి, సముద్ర జలాలు పెరిగితే ముందుగా ప్రభావం ఏ నగరంపై చూపే అవకాశం ఉందన్న విషయం కనుగొనేందుకు గ్రెడియంట్‌ ఫింగర్‌ ప్రింట్‌ మ్యాపింగ్‌ (జీఎఫ్‌ఎం) అనే కొత్త పరికరాన్ని కనుగొంది.

 దీని ద్వారా ప్రంచంలోని ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం అధికంగా ఉండబోతుందని అంచనా వేసింది. గ్రీన్‌ లాండ్‌, అంటార్కిటికాలలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్‌, లండన్‌, ముంబై లాంటి మహానగరాల కంటే ఎక్కువ ముప్పు మంగళూర్‌ కి ఉందని తేలింది. ఈ పరిశోధనలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 293 పోర్టు పట్ణణాలను పరిశీలించింది. ఆ నివేదిక ఆధారంగా గ్రీన్‌ లాండ్‌ ఉత్తరాదితో పాటు తూర్పున ఉన్న మంచుపొరలు కరిగిపోవడం ద్వారా న్యూయార్క్ నగరానికి ఏర్పడే ప్రమాదం కన్నా మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. మంగళూర్ మాత్రమే కాకుండా కరాచీ, చిట్టగాంగ్‌, కొలంబో పట్టణాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని ఈ నివేదికలో నాసా హెచ్చరించింది. 
nasa
India
mangalore
global warming
Ice plaque

More Telugu News