కత్తి మహేష్ తాను సెలబ్రిటీని అని అనుకుంటున్నాడు!: హైపర్ ఆది ఎద్దేవా
- కత్తి మహేష్ ఎవరో తెలియదు
- స్కిట్ లో సుత్తి రాజేష్ గురించి పంచ్ డైలాగులు పెట్టాను
- కత్తి మహేష్ క్యూట్ గా ఉన్నాడు
సుత్తి రాజేష్ ఇల్లిల్లూ తిరుగుతూ పని చేసుకుని బతుకుతాడని, ఫేస్ బుక్ లో ఏది పడితే అది అంటాడని అన్నాడు. తన వీడియోలు కోటి మంది చూస్తారని, కత్తి మహేష్ రివ్యూలు లక్ష మంది చూస్తారని అన్నాడు. కత్తి మహేష్ తాను సెలబ్రిటీని అని అనుకుంటున్నాడని హైపర్ ఆది ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్ ను విమర్శించే స్థాయి కత్తి మహేష్ కు లేదని అన్నాడు.
తన ఫోటో పెట్టి ఫ్యాన్స్ కు 'మేము మేము ఇలా కలిసిపోతాము.. మధ్యలో వెధవలయ్యేది మీరే'నని వ్యాఖ్యానించాడని, తాము ఫ్యాన్స్ ను అలా అనమని అన్నాడు. స్క్రిప్టు రాయాలంటే చాలా కష్టమని, అంత కష్టపడి సినిమా తీస్తే అది బాగో లేదనడానికి కత్తి మహేష్ ఎవరని ఆది ప్రశ్నించాడు.