అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని తిరిగి వెళ్లిన బిగ్ బీ
- కారులో ఎయిర్‌పోర్టుకి వెళుతుండగా ఊడిపోయిన వీల్
- మరో కారులో ఎయిర్‌పోర్టుకి వెళ్లిన అమితాబ్
23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని అమితాబ్ తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన అనంతరం అమితాబ్ మరో కారులో విమానాశ్రయానికి వెళ్లారు. ఆ కారు ఏర్పాటు చేసిన ట్రావెల్ ఏజెన్సీకి బెంగాల్ పోలీసులు షోకాజ్ నోటీస్ జారీ చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి.