dabaang: 'ద‌బాంగ్ 3' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ప్ర‌భుదేవా.. అర్బాజ్ ఖాన్ వెల్లడి!

షార్ట్స్‌లో చూడండి
'ద‌బాంగ్' సిరీస్‌లో భాగంగా మూడో భాగాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ తెలిపాడు. అయితే ఈ మూడో భాగానికి తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేద‌ని, ఆ బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుదేవాకు అప్ప‌గించిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. 'దబాంగ్' చిత్రానికి అభినవ్ కాశ్యప్ వహించగా, 'ద‌బాంగ్ 2' చిత్రానికి అర్బాజ్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ఇక గ‌తంలో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన 'వాంటెడ్' చిత్రానికి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో 'ద‌బాంగ్ 3' షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ని అర్బాజ్ చెప్పాడు. ఈ చిత్రంలో స‌న్నీ లియోన్‌ ఐట‌మ్ సాంగ్ ఉండ‌బోతోంద‌ని ఇటీవ‌ల వచ్చిన వార్త‌ల‌పై అర్బాజ్ ఖాన్ మిశ్రమంగా స్పందించాడు. అయితే ఆ వార్త‌ల‌కు సంబంధించి మాత్రం పూర్తి స్ప‌ష్టత‌నివ్వ‌లేదు.
Go Back to Shorts
dabaang
series
arbaz khan
Salman Khan
prabuhu deva
directorial

More Telugu News