bandla ganesh: నటన పట్ల మోజు పోయింది .. నా కొడుకును కూడా నిర్మాతనే చేస్తాను: బండ్ల గణేశ్

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున తనకి వారసత్వంగా వచ్చిన పౌల్ట్రీ బిజినెస్ చేస్తూ .. మరో వైపున స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బండ్ల గణేశ్ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు. "నిర్మాతగానే కొనసాగుతారా .. ఆర్టిస్టుగా దాహం తీరలేదు గనుక .. నటించే అవకాశం ఉందా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

 అందుకు బండ్ల గణేశ్ స్పందిస్తూ .. "నటనపై మోజు పోయింది .. బాగా సినిమాలు తీయాలి .. ఓ మాంచి స్టూడియో కట్టాలి. నా ఇద్దరు కొడుకుల్లో ఒకరిని నిర్మాతగా ఇండస్ట్రీకి తీసుకురావాలి. నా స్కెచ్ ఇది .. ఇక దేవుడు ఏం చేస్తాడో చూడాలి. ఏ తేజ గారో వచ్చి మీ అబ్బాయిని హీరోను చేస్తానని అంటే .. ఇవ్వకుండా ఎలా ఉంటాం?  మరొక అబ్బాయిని మాత్రం పౌల్ట్రీలో పెట్టేస్తాను" అని చెప్పారు. మరో ప్రశ్నకి సమాధానంగా .. " ప్రస్తుతం నేనున్న పొజీషన్ చూసి ఎవరూ అసూయపడరనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ అంత సమయం ఉండదు .. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వుంటారు. అయినా ఒకరిని గురించి ఆలోచించేవాళ్లెప్పుడూ ఎదగరని నా అభిప్రాయం" అంటూ స్పష్టం చేశారు.       
Go Back to Shorts
bandla ganesh

More Telugu News