bandla ganesh: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తే అదో గౌరవంగా భావిస్తా: బండ్ల గణేశ్

షార్ట్స్‌లో చూడండి
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'వినోదం' సినిమాలో గణేశ్ ఒక చిన్న పాత్రను పోషించారు. ఆ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఎస్వీ కృష్ణా రెడ్డి తనకి లైఫ్ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాంటి గణేశ్ ఆ తరువాత కాలంలో పెద్ద నిర్మాత అయ్యారు. అయినా ఆయన ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేయలేదనే విమర్శలు వున్నాయి. ఇదే విషయం తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావన కొచ్చింది.

 అందుకు బండ్ల గణేశ్ స్పందిస్తూ .. "కృష్ణారెడ్డి గారు నాకు ఛాన్స్ ఇచ్చారు .. ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నన్ను ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ఈ రోజుకి కూడా ఆయన ఎక్కడ కనిపించినా కాళ్లకు నమస్కారం చేసి .. ఆశీస్సులు తీసుకుంటా. నా బ్యానర్ పై  ఓ సినిమా చేయమని నేను అడుగుతూనే వుంటాను .. చేద్దామని ఆయన అంటుంటారు. ఒక రీమేక్ కోసం చూస్తున్నాను .. ఆయన దర్శకత్వంలో చేస్తాను. కృష్ణారెడ్డి గారితో ఒక సినిమా చేస్తే .. అది ఆయనకి నేను చేసే సాయం కాదు .. నా బ్యానర్ కి గౌరవం అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు          
Go Back to Shorts
bandla ganesh
krishnareddy

More Telugu News