భూతల స్వర్గాన్ని నిర్మించేందుకు 25 వేల ఎకరాలు కొనుగోలు చేసిన అపరకుబేరుడు!
- ఆరిజోనా రాష్ట్రంలో 'బెల్ మోంట్ నగరం' నిర్మించనున్న బిల్ గేట్స్
- 523.7 కోట్లతో 25 వేల ఎకరాల కొనుగోలు
- 80 వేల నివాస గృహాల నిర్మాణం
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతమైన సాంకేతిక సమాచార వ్యవస్థ.
బెల్ మోంట్ ప్రస్తుత సమాజం తరువాతి దశ మేధో సమాజాన్ని సృష్టిస్తుందని వారు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యధిక వేగవంతమైన సాంకేతిక సమాచార వ్యవస్థలు, కేంద్రాలు, సరికొత్త తయారీ పరిజ్ఞానాలు, పంపిణీ విధానాలు, సొంతంగా నడిచే కార్లు, ఇతర సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అయితే ఈ నగర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ నగర నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? వంటి వివరాలేవీ వెల్లడించకపోవడం గమనార్హం.