బోటు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన మంత్రి అఖిలప్రియ
- ప్రమాదానికి గల కారణాలపై ఆరా
- అధికారులతో సమీక్ష
- తక్షణ విచారణకు ఆదేశం
బోటు ఎప్పుడు బయల్దేరింది? ప్రయాణ సమయంలో బోటులో ఎంత మంది ఉన్నారు? పరిమితికి మించి బోటులో ఎక్కించుకున్నారా? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. బోటు నిర్వాహకులైన రివర్ బోటింగ్ సంస్థ, సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థల లైసెన్స్ ల గురించి ఆరా తీశారు. తక్షణమే ఘటనపై విచారణ జరపాలంటూ అధికారులను ఆదేశించారు.