20 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. 11 మృత దేహాల వెలికితీత

  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • మరో నలుగురు గల్లంతైనట్టు సమాచారం
  • మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు
విజయవాడ వద్ద ఉన్న కృష్ణా నది బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 11 మృత దేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలో నుంచి బయటకు తీశారు. వీరిలో ఆరుగురు మహిళలు కాగా, ఐదుగురు మగవారు ఉన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు, మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారంతా ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వీరిలో బంధువులు, స్నేహితులు ఉన్నారని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీని చూసిన తర్వాత... వీరంతా పవిత్ర సంగమాన్ని చూసేందుకు బోటులో బయల్దేరారు. మార్గమధ్యంలో బోటు బోల్తా కొట్టడంతో, ఘోర ప్రమాదం సంభవించింది.
Go Back to Shorts
Vijayawada
vijayawada boat accident

More Telugu News