పెరిగిన మృతుల సంఖ్య.. బోటు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన చంద్రబాబు
Add ap7am to your home Screen

పెరిగిన మృతుల సంఖ్య.. బోటు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన చంద్రబాబు

  • 12 మంది చనిపోయినట్టు సమాచారం
  • జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన చంద్రబాబు
  • అన్ని చర్యలు చేపట్టాలంటూ ఆదేశం
విజయవాడ కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య 12కు చేరుకున్నట్టు సమాచారం. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో, బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, కృష్ణా జిల్లా కలెక్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కేరళలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. మరోవైపు, ఎంత రాత్రయినా సరే, గాలింపు చర్యలను కొనసాగించాలని హోంమంత్రి చినరాజప్ప అధికారులను ఆదేశించారు.
Vijayawada
vijayawada boat accident
Chandrababu
ap cm

More Telugu News