చిత్తూరు, నెల్లూరు జిల్లా వాసులను బెంబేలెత్తించిన భూ ప్రకంపనలు!

  • చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణాపురం గ్రామంలో భూప్రకంపనలు
  • నెల్లూరు జిల్లా పొదలకూరులో కూడా ప్రకంపించిన భూమి 
  • భయంతో ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సంభవించిన భూ ప్రకంపనలు స్థానికులను బెంబేలెత్తించి, ఇళ్లలోంచి పరుగులు తీయించాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణాపురం గ్రామంతో పాటు నెల్లూరు జిల్లా పొదలకూరు గ్రామాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. కాళ్ల కింద భూమి నాలుగు సెకన్ల పాటు కంపించి పోవడంతో బెంబేలెత్తిన ప్రజలు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. చాలాసేపు ఇళ్ల బయటే కాలం గడిపారు.   
Go Back to Shorts
chittore
nellore
earth quake

More Telugu News