స్పాన్సర్లతో మాట్లాడి నిబంధన తొలగిస్తాం.. లేకుంటే గోల్డ్ మెడల్ రద్దు చేస్తాం.. దిగివచ్చిన పూణే యూనివర్సిటీ!
- వెజిటేరియన్లు, మద్యం సేవించని వారికే గోల్డ్ మెడల్ అంటూ నిబంధన
- విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చిన వర్శిటీ
- స్పాన్సర్లతో మాట్లాడి ఒప్పిస్తామని, లేని పక్షంలో గోల్డ్ మెడల్ రద్దు చేస్తామని ప్రకటన
ఈ గోల్డ్ మెడల్ కు శెలార్ కుటుంబ సభ్యులు స్పాన్సర్లుగా ఉన్నారని, దీనిపై వారితో చర్చిస్తామని తెలిపారు. స్పాన్సర్లు ఈ నిబంధన ఉండాల్సిందేనని పట్టుబడితే మాత్రం ఈ గోల్డ్ మెడల్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.