డెలివరీ బాయ్ ను, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చిలుక!
- ఏడుస్తూ రక్షించండి రక్షించండి అని అరిచిన డియాగో అనే చిలుక
- డియాగో యజమాని సుసాన్ బయటకు వెళ్లడంతో చిలుక ఆందోళన
- రక్షించమంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన డెలివరీ బాయ్
దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచి ఆ ఇంట్లో ప్రవేశించారు. అయితే వారు ఇంట్లోకి వెళ్లి వెతికే సరికి మహిళ ఎవరూ కనబడలేదు. ఇంతలో అక్కడున్న ఓ చిలుక అలా మహిళ గొంతుతో మళ్లీ అరుస్తూ కనిపించింది. దీంతో తమని అంతగా కంగారు పెట్టింది ఆ చిలుకన్న విషయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు, డెలివరీ బాయ్ చివరికి నవ్వుకున్నారు.
ఇంతకీ ఆ చిలుక పేరు డియాగో... దీనిని సుసాన్ పెంచుకుంటోందని, ఆమె బయటకు వెళ్లడంతో అది ఇలా కంగారు పెట్టిందని పోలీసులు తెలిపారు. అయితే తరువాత ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న సుసాన్.. తాను బయటకు వెళ్లడంతో ఒంటరితనం ఫీలైన డియాగో అలా ఏడ్చి ఉంటుందని ఆమె చెప్పింది.