విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ జంట
- విడివిడిగా ఉంటున్న మలైకా, అర్భాజ్
- కుమారుడి జన్మదినోత్సవంలో కలుసుకున్న మాజీ దంపతులు
- తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న మలైకా
ఈ వేడుకను పురస్కరించుకుని మలైకా ఇన్స్టాగ్రామ్ లో ఫొటో అప్ లోడ్ చేసింది. అంతేకాదు, "నా బాబు పెద్దవాడు అయ్యాడు. హ్యాపీ బర్త్ డే మై జాన్" అంటూ కామెంట్ పెట్టింది. అంతేకాదు, తాము విడాకులు తీసుకున్నా, తమ కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపింది. తాము విడివిడిగా ఉన్నా... కుమారుడి మంచి చెడ్డలను కలిసే చూస్తామని చెప్పింది.