ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్న ఏపీ అసెంబ్లీ... చూడండి!

  • ఈ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ
  • 10 రోజులు సాగనున్న సమావేశాలు
  • విపక్షం లేకుండా సమావేశాలు
ఈ ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సందడి లేకుండా కనిపిస్తోంది. ప్రతిపక్షమైన వైకాపా ఈ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో ఖాళీగా కనిపిస్తోంది. తమ పార్టీ టికెట్ పై విజయం సాధించి, టీడీపీలోకి ప్రవేశించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేసిన తరువాతనే అసెంబ్లీకి వస్తామని చెబుతూ, వైకాపా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం సమావేశమైన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) పది పనిదినాలు అసెంబ్లీని నడిపించాలని నిర్ణయించగా, ఆపై జాతీయగీతాలాపనతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లోపల బోసిపోయి కనిపిస్తోంది. సభ ప్రారంభమైన అనంతరం కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు లేని అసెంబ్లీ చిత్రమిది!
Go Back to Shorts
ap assembly
ysrcp
Telugudesam
kodela

More Telugu News