సందీప్ చెప్పిన కథ విని అసూయతో రగిలిపోతున్నా!: రాంగోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సందీప్ చెప్పిన కథ విని అసూయతో రగిలిపోతున్నా!: రాంగోపాల్ వర్మ

  • అర్జున్ రెడ్డి దర్శకుడిపై ప్రశంసల వర్షం
  • కొత్త కథ చెప్పాడని వెల్లడి
  • అది ఓ మెగాహిట్ అవుతుందన్న రాంగోపాల్ వర్మ
ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు సందీప్ పై మరో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పొగడ్తలు గుప్పించాడు. అతను తన తదుపరి సినిమా కథను వివరించాడని, అది విన్న తరువాత తాను అసూయతో రగిలిపోయానని అన్నాడు. సందీప్ చెప్పిన కథతో తీసే సినిమా ముందు అర్జున్ రెడ్డి ఓ సూపర్ ఫ్లాప్ సినిమా అయిపోతుందని, అంతటి మెగా విజయాన్ని ఆయన తదుపరి చిత్రం సొంతం చేసుకుంటుందని అన్నాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెడుతూ, తామిద్దరూ కలిసి దిగిన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
arjunreddy
ramgopal varma
sandeep

More Telugu News