student: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని ఆందోళన చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం అగ్రికల్చరల్ కాలేజ్ లో రాజశేఖర్ అనే విద్యార్థి బీఎస్సీ చదువుతున్నాడు. జడ్చర్ల కాకతీయ హైస్కూల్‌ లో తెలుగు మీడియంలో పదో తరగతి పూర్తి చేసిన రాజశేఖర్, మహబూబ్‌ నగర్‌ లోని ప్రతిభ కాలేజ్‌ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

అనంతరం పాలెం అగ్రికల్చరల్ కాలేజీలో బీఎస్సీలో జాయిన్ అయ్యాడు. ఏజీ బీఎస్సీ ఇంగ్లిష్‌ మీడియం కావడంతో తెలుగు మీడియంలో చదివిన రాజశేఖర్ పాఠాలు అర్థం చేసుకోలేకపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇంగ్లిష్ పై పట్టుకు ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. దీంతో తీవ్ర ఆత్మన్యూనతకు గురికావడంతో పంటపొలంలో వేసే గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అతనిని సకాలంలో తోటి విద్యార్థులు గమనించడంతో హుటాహుటీన నాగర్‌ కర్నూల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యచికిత్స జరుగుతోంది. 
Go Back to Shorts
student
sucide
mahaboobnagar

More Telugu News