india: నోట్ల రద్దు వార్షికోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఇదే!

  • నోట్ల రద్దుకు ఏడాది
  • నిర్ణయాత్మక యుద్ధంలో గెలిచిన భారతీయులు
  • ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన మోదీ
  • ప్రజలకు కృతజ్ఞతలన్న ప్రధాని

నవంబర్ 8, సరిగ్గా సంవత్సరం క్రితం చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ పెను సంచలనానికి తెరలేపిన రోజు. నల్లధనాన్ని పూర్తిగా నివారించడమే లక్ష్యంగా మోదీ ప్రకటించిన నిర్ణయం, వ్యవస్థలో ఎంత మార్పు చూపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇక నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా తన సామాజిక మాధ్యమ ఖాతాలో మోదీ, ఓ వ్యాఖ్య చేశారు.

"125 కోట్ల మంది భారతీయులు ఓ నిర్ణయాత్మక యుద్ధం చేసి అందులో గెలిచారు" అని వ్యాఖ్యానించారు. నల్లధనం, లంచగొండితనంపై యుద్ధం చేసి విజయం సాధించామని అన్నారు. అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలకు మద్దతుగా నిలిచిన ప్రజల ముందు తాను శిరస్సు వంచుతున్నట్టు తెలిపారు.

కాగా, సరిగ్గా ఏడాది క్రితం తొలుత హిందీలోనూ, ఆపై ఇంగ్లీషులోనూ 40 నిమిషాలు ప్రసంగించిన మోదీ, "ఈ అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవు. అవి ఇంక కేవలం చిత్తు కాగితాలతో సమానం. మీ వద్ద ఉన్న అన్ని నోట్లనూ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకునేందుకు నేను 50 రోజుల సమయాన్ని ఇస్తున్నాను" అని జాతిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.



More Telugu News