జనవరి 31 నుంచి రైల్వే ఉద్యోగులకు ఆధార్ ఆధారిత హాజరు
- స్పష్టం చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ
- కోల్కతా మెట్రో రైలు కార్యాలయాల్లో మొదట ప్రయోగం
- ఆలస్యంగా వచ్చేవారికి చెక్ పెట్టే ప్రయత్నం
ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు, అసలు ఉద్యోగానికే హాజరవని ఉద్యోగులకు చెక్ పెట్టేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ పద్ధతి హాజరు విధానం కొన్ని ముఖ్య రైల్వే కార్యాలయాల్లో అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.