రైల్వే స్టేషన్‌లో తల్లి పక్కన నిద్రిస్తోన్న చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు.. వీడియో విడుదల!
- గోవాలోని మార్గావ్ రైల్వేస్టేషన్‌లో ఘటన
- బ్యాగ్ కొట్టేసి, అలాగే మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
అలాగే చిన్నారిని ఎత్తుకుని ఓ టవల్ కప్పి తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తరువాత ఆ కుటుంబంలోని ఓ అమ్మాయికి మెలుకువ వచ్చింది. తన చెల్లి అక్కడ లేని విషయాన్ని గుర్తించింది. వెంటనే తన తల్లిదండ్రులను లేపి, ఈ విషయాన్ని చెప్పింది. వారంతా కలిసి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దుండగుడిని గాలిస్తున్నారు.