Telangana: అనూహ్య నిర్ణయం.. టీడీపీలోకి తిరిగి రేవంత్ బ్యాచ్!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కొడంగల్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున పార్టీ మారారు. రేవంత్‌తోపాటు ఢిల్లీ వెళ్లి మరీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రోజులైనా కాకముందే తిరిగి టీడీపీలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌తోపాటు ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుయాదవ్ గురువారం హైదరాబాద్‌లో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి కూడా తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీని వీడి పెద్ద పొరపాటు చేశానని ఆయన చెప్పినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి గురువారం నాటి సమావేశంలో చెప్పారు. మధు తిరిగి పార్టీలో చేరాలనుకుంటున్నట్టు తనతో చెప్పారని, పార్టీ నాయకులతో మాట్లాడి చెబుతానని మధుకు చెప్పినట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు.
Go Back to Shorts
Telangana
Telugudesam
Revanth Reddy
Ramana
Chandrababu

More Telugu News