షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్... ఈసారి టార్గెట్ సెల్ఫీ ప్రియులు!
- రెడ్‌మీ వై1, వై1 లైట్ పేరుతో మార్కెట్లోకి విడుదల
- ఎంఐయూఐ 2ను విడుదల చేసిన చైనా కంపెనీ
- వై1 ధర రూ. 8,999, వై1 లైట్ ధర రూ. 6,999
రెడ్‌మీ వై1 మొబైల్ 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999గా, 4జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీతో వస్తున్న వై1 లైట్ మొబైల్ ధరను రూ.6,999గా ప్రకటించింది. ఈ రెండు ఫోన్ల అమ్మకాలు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌లలో ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఎంఐ స్టోర్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఇదే కార్యక్రమంలో ఫర్మ్‌వేర్ ఇంటర్‌ఫేస్ ఎంఐయూఐ 9ను కూడా షియోమి ఆవిష్కరించింది. త్వరలో రెడ్‌మి నోట్ 4, ఎంఐ మిక్స్ 2, ఎంఐ మ్యాక్స్2 ఫోన్లకు అప్‌డేట్ అందిస్తామని తెలిపింది.