దూసుకొచ్చిన ఎద్దు... హేమమాలినికి తృటిలో తప్పిన ప్రమాదం... వీడియో చూడండి!

  • మధురలో ఆకస్మిక తనిఖీలు చేసిన హేమమాలిని
  • అదుపు తప్పి దూసుకొచ్చిన ఎద్దు
  • హేమకు రక్షణగా నిలిచిన అధికారులు 
  • స్టేషన్లో పశువులేంటని అధికారులపై ఎంపీ ఆగ్రహం
పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని, మధుర రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన వేళ, పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె స్టేషన్ లో నడిచి వస్తుండగా, ఓ ఎద్దు అదుపు తప్పి స్టేషన్ లోకి దూసుకు వచ్చింది. దాన్ని అదుపు చేయాలని కొంతమంది ప్రయత్నించడంతో, బెదిరిపోయి పరుగులు తీసింది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఆమె చుట్టూ నిలబడి, ఆమెను పక్కకు తప్పించారు. ఎద్దు కూడా పక్కనుంచి వెళ్లిపోవడం, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆపై రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజలకు సైతం సౌకర్యాలు లభించడం లేదని క్లాస్ తీసుకున్నారు. ఎద్దు దూసుకొచ్చిన వీడియోను మీరూ చూడవచ్చు.

Go Back to Shorts
hema malini
madhura railway station
ox

More Telugu News