rana: 'హిరణ్యకశిప' కోసం రానాను గుణశేఖర్ ఒప్పించాడట .. ఇక సమస్యల్లా 100 కోట్ల బడ్జెట్ తోనే!

షార్ట్స్‌లో చూడండి
'రుద్రమదేవి' వంటి భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించి .. దర్శకుడిగా గుణశేఖర్ తన సమర్థతను మరోమారు నిరూపించుకున్నారు. కొంతకాలంగా ఆయన 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది 'భక్త్ర ప్రహ్లాద' కథే అయినా .. హిరణ్యకశిపుడి కోణంలో కొనసాగుతుంది. అందువల్లనే గుణశేఖర్ ఈ సినిమాకి 'హిరణ్యకశిప' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.

 ఈ సినిమాలో ఈ పాత్రకు ఆయన రానాను ఒప్పించాడనే టాక్ వినిపిస్తోంది. అయితే వచ్చిన సమస్యల్లా 100 కోట్ల బడ్జెట్ తోనే. ఈ సినిమాకి 100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని గుణశేఖర్ చెబుతున్నారట. అయితే రానాకు ఆ స్థాయి మార్కెట్ లేకపోవడం .. 'రుద్రమదేవి' కూడా లాభాలు తీసుకురాకపోవడం వలన, నిర్మాతలు వెనుకాడుతున్నారని టాక్. ఈ భారీ ప్రాజెక్టు విషయంలో ఎవరు ధైర్యం చేస్తారనేది చూడాలి.     
Go Back to Shorts
rana

More Telugu News