సచిన్ ఘోర తప్పిదం.. ఆటాడుకున్న నెటిజన్లు!
- మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకున్నాక సచిన్ ట్వీట్
- అవాక్కయిన నెటిజన్లు.. వైరల్ అయిన ట్వీట్
- వ్యంగ్యోక్తులతో విరుచుకుపడుతున్న నెటిజన్లు
కాన్పూర్ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 337 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన కివీస్ తొలి నుంచే దూకుడు మొదలుపెట్టింది. విజయం దిశగా దూసుకుపోయింది. కివీస్ గెలుపు తథ్యమని అందరూ భావించారు. అయితే చివరలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. చివరికి భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన వన్డేలో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగ్గా సచిన్ సోమవారం ఈ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది.