akkineni: అక్కినేని పూజ చేయడం చూశాను.. నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: డాక్టర్ కృష్ణక్క

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున వైద్య వృత్తిలో రాణిస్తూనే .. మరో వైపున రచయిత్రిగాను కె.వి.కృష్ణకుమారి (కృష్ణక్క) పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావును "అన్నయ్య" అంటూ ఆత్మీయంగా పిలిచే ఆమె .. ఆ కుటుంబంతో తనకి గల అనుబంధాన్ని గురించి తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో ముచ్చటించారు.

"అక్కినేని నాగేశ్వరరావును అంతా నాస్తికుడు అంటారు .. కానీ ఆయన నాస్తికుడు కాదు. వదిన పోయిన కొత్తల్లో .. ఒక రోజున ఆయన ఎక్కడున్నారా అని ఆ ఇంట్లో చూస్తూ వెళితే, విప్రనారాయణుడిలా పూజ గదిలో నుంచుని పూజ చేస్తూ కనిపించారు. ఆయన దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉండగా ఎవరూ చూడలేదు .. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఆయన నన్ను గమనించి .. "మీ వదిన నన్ను ఎంతగా ప్రేమించిందో .. నేను అంతకన్నా ఎక్కువగా ఆమెను ప్రేమించాను. ఇప్పుడు వదిన లేదు గదా అని ఈ గదిలో దీపం వెలిగించకపోయినా .. పూజ చేయకపోయినా ఆమె మనసు ఎంతో బాధ పడుతుంది. అందుకే నేను రోజు పూజ చేస్తున్నాను" అని ఆయన అనగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
akkineni

More Telugu News