పూల అంగళ్లు తొలగించిన మునిసిపల్ సిబ్బంది.. చిత్తూరులో ఉద్రిక్తత!

  • షోరూమ్ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
  • అడ్డుకునేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
  • టీడీపీ నాయకుల రాకతో పరిస్థితి ఉద్రిక్తం
చిత్తూరులోని చర్చి వీధిలో పూల అంగళ్లు తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ షోరూమ్‌కు సంబంధించిన స్థలంలో కొందరు పూల వ్యాపారులు అంగళ్లు నిర్వహిస్తున్నారు. అంగళ్ల కారణంగా తమ వ్యాపారానికి ఇబ్బంది ఏర్పడుతోందని ఆరోపిస్తూ షోరూమ్ యజమాని పోలీసులకు, మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు చర్చి వీధికి చేరుకుని అంగళ్లు తొలగించే ప్రయత్నం చేశారు.

దీంతో అంగళ్ల నిర్వాహకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు. వారికి పోటీగా టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి మరింతగా ముదరకముందే పోలీసులు సీకేబాబు, అతని అనుచరులను అక్కడి నుంచి బలవంతంగా తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Go Back to Shorts
Chittoor
CK Babu
Telugudesam
Flower Market

More Telugu News