Aamir Khan: ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తా: ఆమిర్‌ఖాన్‌

  • చైనాలో ఘ‌నవిజ‌యం సాధించిన‌ ఆమిర్ ఖాన్ ‘దంగల్‌’ సినిమా
  • మరో రెండు నెలల్లో ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చైనాలో విడుద‌ల  
  • చిత్రానికి పెట్టిన పెట్టుబడి వసూలైతే అది విజయం సాధించినట్లే

బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్ న‌టించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాకు మంచి స్పందన వస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను కూడా చైనాలో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్‌’ సినిమా చైనాలో ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ చిత్రం కూడా అక్క‌డ మంచి వసూళ్ల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ విష‌యంపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ... మరో రెండు నెలల్లో ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ని చైనాలో కచ్చితంగా విడుదల చేస్తామ‌ని అన్నారు. దీని కోసం సన్నాహాలు కూడా చేస్తున్నామ‌ని తెలిపారు.

ఈ దీపావళికి బాలీవుడ్ సినీ పరిశ్రమలో ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాలు విజ‌య‌వంతం అయ్యాయ‌ని వ్యాఖ్యానించారు. ఓ చిత్రానికి పెట్టిన పెట్టుబడి వసూలైతే అది విజయం సాధించినట్లని అన్నారు. ఆ సినిమా రెట్టింపు వసూలు చేస్తే సూపర్‌హిట్‌ అయినట్లని అన్నారు.

More Telugu News