వెంకటేశ్, మహేశ్ ల గురించి 'బిగ్ బాస్-11' కంటెస్టెంట్ హీనా ఖాన్ ఏమందో తెలుసా?
- దక్షిణాది హీరోయిన్లతో పాటు, వెంకటేష్, మహేశ్ బాబుపై అవాకులు చవాకులు పేలిన హీనా ఖాన్
- ప్రేక్షకులు బబ్లీ హీరోయిన్లను ఇష్టపడతారు, దర్శకులు కూడా బరువు పెరగమంటారు
- 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటించమన్నారు
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, దక్షిణాదిలో బబ్లీ హీరోయిన్లను బాగా ఇష్టపడతారని తెలిపింది. అక్కడి దర్శకులు కూడా హీరోయిన్లను బరువు పెరగమంటారని చెప్పింది. తనను బరువు పెరగమనడంతో రెండు సినిమా అవకాశాలు వదిలేశానని తెలిపింది. చీరలు కట్టుకుని అటూ ఇటూ గెంతమంటారని వ్యాఖ్యానించింది.
తనకు 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్ సరసన నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. 'అనారీ' ('చంటి') సినిమాలో కరిష్మాకపూర్ సరసన నటించిన హీరోయే వెంకటేష్ అని ఆ షోలో గుర్తు చేసింది. ఆ సినిమా ఆఫర్ ను అనవసరంగా వదిలేశానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సినిమాలో వెంకటేష్, మహేశ్ బాబు కలిసి నటించారని, వారి ఫ్యాన్స్ కుర్చీలు విరిగేలా కొట్టుకుంటారని తనకు బాగా తెలిసినట్టు చెప్పింది. ఆ సినిమా సౌత్ లో పెద్ద హిట్ అయిందని చెప్పింది.