chandrababu: సమావేశం అసంపూర్తిగా ముగిసింది: చంద్రబాబుతో భేటీ అనంతరం రావుల

షార్ట్స్‌లో చూడండి
దాదాపు రెండు గంటలపాటు చంద్రబాబుతో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం అసంపూర్తిగా ముగిసిందని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన రావుల, పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను ఎల్ రమణ స్వయంగా తమ అధినేతకు వివరించారని తెలిపారు.

రేవంత్ పై చర్యలు తీసుకునే బాధ్యత తమ అధినేతపై ఉంచామని అన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబుతో మాట్లాడేంత సమయం లేకపోయిందని అన్నారు. నేడు అన్ని విషయాలనూ చర్చించలేకపోయామని, చంద్రబాబు విజయవాడకు బయలుదేరాల్సిన సమయం కావడంతో, రేపు తాము విజయవాడకు వెళ్లి చంద్రబాబుతో మరోసారి భేటీ అవుతామని అన్నారు.
Go Back to Shorts
chandrababu
ravula
revant
l ramana

More Telugu News