యుగ పురుషుడు ఎన్టీఆర్‌తో ఏ1 ముద్దాయి అయిన జగన్ తనను తాను పోల్చుకోవడం సరికాదు: యనమల
- అప్పట్లో ఎన్టీఆర్ ఒక్కరే వాకౌట్ చేశారు
- జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు
- అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుని మరో తప్పిదం చేశారు
- కోర్టులు, అసెంబ్లీ నుంచి తప్పించుకునేందుకే జగన్ పాదయాత్ర
గతంలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీని బహిష్కరించారని జగన్ గుర్తు చేశారని, అయితే, యుగపురుషుడు ఎన్టీఆర్‌తో ఏ1 ముద్దాయి జగన్ తనను తాను పోల్చుకోవడం సరికాదని అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఒక్కరే వాకౌట్ చేశారని, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారని వివరించారు. జగన్ తీరు నచ్చకపోవడంతోనే వైసీపీ నేతలు పార్టీలు మారుతున్నారని, ఈ పాదయాత్రతో జగన్‌కు ప్రజలు కూడా దూరమవుతారని యనమల అన్నారు.