ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాదన్నపేట్ పీఎస్ కు తరలించిన పోలీసులు

  • ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్
  • కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ర్యాలీగా బయల్దేరిన ఉత్తమ్ అరెస్ట్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని గాంధీభవన్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలసి ర్యాలీగా బయల్దేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నగరంలోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Go Back to Shorts
tpcc
utham kumar reddy
congress
chalo assembly

More Telugu News