ఆ నటితో తనకు సంబంధముందన్న నవాజుద్దీన్ సిద్ధిఖీ... ఖండించిన బాలీవుడ్ నటి నిహారిక!
- జీవితకథలో పేర్కొన్న బాలీవుడ్ నటుడు
- పుస్తకం అమ్ముడవడం కోసం తప్పుడుగా చెప్పాడన్న నిహారిక
- `మిస్ లవ్లీ` సినిమాలో కలిసి నటించిన నవాజ్, నిహారిక
`తనను ఒకసారి మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. తర్వాత ఆమె నన్ను వాళ్లింటికి ఆహ్వానించింది. కొంచెం సంకోచంగానే ఆమె ఇంటికి బయల్దేరాను. వెళ్లి తలుపు కొట్టాను. ఆమె తలుపు తీయగానే ఇల్లంతా వెలుగుతున్న కొవ్వొత్తులు కనిపించాయి. ఆ కొవ్వొత్తుల వెలుగులో ఆమె చాలా అందంగా కనిపించడంతో నా పల్లెటూరి మనసు ఆగలేదు. వెంటనే ఇద్దరం బెడ్రూంలోకి వెళ్లి, గాఢమైన ప్రేమను పంచుకున్నాం. తర్వాత ఆ ప్రేమ ఒకటిన్నర సంవత్సరాలు కొనసాగింది` అని బయోగ్రఫీలో ఉంది.
అయితే పుస్తకంలోని ఈ వ్యాఖ్యలను నిహారిక ఖండించింది. పుస్తకం అమ్మకాల కోసమే నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇలా తప్పుగా మాట్లాడుతున్నాడని ఆరోపించింది. `మిస్ లవ్లీ చిత్రం తర్వాత మేం కొన్ని నెలలే కలిసున్నాం. పుస్తకంలో ఆయన చెప్పిన విధానం చూస్తే చాలా నవ్వొస్తోంది. పుస్తకం అమ్మకాల కోసం మహిళను అగౌరవ పరచాలనుకోవడం సబబు కాదు. ఆయన చాలా గొప్ప నటుడు. ఆ నటనను తెర మీదకే పరిమితం చేస్తే బాగుంటుంది` అని నిహారిక అంది.