న‌టి అసిన్ కూతురి ఫొటోను షేర్ చేసిన అక్ష‌య్ కుమార్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న‌టి అసిన్ కూతురి ఫొటోను షేర్ చేసిన అక్ష‌య్ కుమార్‌!

  • రాహుల్ శ‌ర్మ‌, అసిన్‌ల ప్రేమ పెళ్లికి ప‌రోక్షంగా స‌హాయం చేసిన అక్ష‌య్‌
  • మొద‌ట పాప‌ను ఎత్తుకున్న అక్ష‌య్ కుమార్‌
  • శుభాకాంక్ష‌లు తెలిపిన నెటిజ‌న్లు
'గజని', `అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి`, `శివ‌మ‌ణి` వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌టి అసిన్ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. 2016 జ‌న‌వ‌రిలో పెళ్లి చేసుకున్న రాహుల్ శ‌ర్మ‌, అసిన్ దంప‌తులు అసిన్ గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యాన్ని బ‌య‌ట‌కు రానీయ‌లేదు. కానీ వారికి పాప జ‌న్మించిన విష‌యాన్ని రాహుల్ శ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు. అయితే ఇప్పుడు పాప ఫొటోను బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

త‌ల్లిదండ్రులు కాకుండా పాప‌ను మొద‌ట‌ ఎత్తుకున్న అక్ష‌య్ కుమార్ ఫొటో చూసి కింద అసిన్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి అసిన్ `ఖిలాడి 786` చిత్రంలో న‌టించింది. అప్ప‌టి నుంచి వీళ్లిద్ద‌రూ మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా అసిన్‌, రాహుల్ శ‌ర్మ‌ల పెళ్లి జ‌రగ‌డానికి కూడా ప‌రోక్షంగా అక్ష‌య్ కుమారే కార‌ణం.
asin
shivamani
akshay kumar
baby girl
rahul sharma

More Telugu News