తొలి మ్యాచ్ లోనే కోహ్లీ అంటే ఏమిటో గుర్తించా: సచిన్
- కోహ్లీ దూకుడు అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉంది
- కోహ్లీ దూకుడే జట్టుకు బలం
- ప్రశంసలు కురిపించిన సచిన్
కోహ్లీ దూకుడు భారత జట్టుకు బలమనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పాడు. అయితే, ఆట విషయంలో అతని దృక్పథం మాత్రం మారిందని సచిన్ తెలిపాడు. వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్లలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను కోహ్లీ అధిగమించిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించాడు. వన్డేల్లో పాంటింగ్ 30 సెంచరీలు చేయగా... న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 31వ సెంచరీని నమోదు చేశాడు.