మహిళా ప్యాసింజర్ ముందు పాడుపని చేసిన హైదరాబాద్ ఉబెర్ డ్రైవర్ అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా ప్యాసింజర్ ముందు పాడుపని చేసిన హైదరాబాద్ ఉబెర్ డ్రైవర్ అరెస్ట్!

  • విమానాశ్రయానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న యువతి
  • ఓఆర్ఆర్ పై వేగం తగ్గించి హస్తప్రయోగానికి దిగిన డ్రైవర్
  • యువతి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీ వెళ్లే విమానాన్ని అందుకోవాలని ఉబెర్ కు చెందిన క్యాబ్ ను బుక్ చేసుకున్న యువతికి ఒ పాడు అనుభవం ఎదురైంది. ఆమె ఫిర్యాదు మేరకు ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కొండాపూర్ లో నివాసం ఉంటున్న ఉమా శర్మ అనే యువతి, ఈ నెల 19న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ఆపై కారు ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్లిన తరువాత డ్రైవర్ అసలు స్వరూపం బయటపడింది.

"కారు వేగాన్ని 50 కిలోమీటర్లకు తగ్గించేసిన డ్రైవర్, అద్దంలో నన్ను చూస్తూ హస్తప్రయోగానికి పాల్పడ్డాడు. చుట్టూ మరే వాహనాలూ రాకపోవడంతో నాకు భయమేసింది" అని ఉమా శర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించింది. తాను కేకలు పెట్టిన తరువాతనే కారు ఆపాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.

ఢిల్లీలో దిగగానే 1091కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు, సఫ్దర్ జంగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వారి నుంచి అందిన సమాచారంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, రెండు స్పెషల్ టీములను ఏర్పాటు చేయగా, సదరు క్యాబ్ డ్రైవర్ ను ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఉబెర్ క్యాబ్ సేవల సంస్థపైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Masturbates
orr
uber cab driver

More Telugu News