శ్రీరాముడే మాడు పగలగొడతాడు: బీజేపీపై లాలూ నిప్పులు
- రాముడి పేరిట రాజకీయాలు మొదలు
- బీజేపీది నీతిమాలిన చర్య
- నిప్పులు చెరిగిన ఆర్జేడీ అధినేత
మతం పేరిట జరుగుతున్న ఈ డ్రామాను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నిజంగా రామమందిరం నిర్మాణానికి కట్టుబడిన వారైతే, ఈ మూడేళ్లూ ఏం చేశారని లాలూ ప్రశ్నించారు. మోదీ సర్కారు నోట్ల రద్దుతో పేద ప్రజల జీవనాన్ని మరింత దుర్భలం చేసిందని ఆరోపించిన ఆయన, దేశ ప్రజల మనసులో గూడుకట్టుకున్న శ్రీరామచంద్రుడే ఆర్ఎస్ఎస్, బీజేపీలను నామరూపాల్లేకుండా చేస్తాడని, ఈ రెండు పార్టీలనూ దేశం నుంచి తరిమేస్తాడని జోస్యం చెప్పారు.